ఆధ్యాత్మికం:  బలహీనత అంటే ఏమిటి..దానిని వదిలితే  జీవితంలో విజయం సాధిస్తారు

ఆధ్యాత్మికం:  బలహీనత అంటే ఏమిటి..దానిని వదిలితే  జీవితంలో విజయం సాధిస్తారు

ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ప్రధానంగా వదలవలసినది ఏదో, చేయవలసినది ఏదో స్పష్టంగా, సూటిగా నిర్మొహమాటంగా చెప్పాడు .ఒక పని ప్రారంభించినప్పుడు ఆపనిని తాను చేయలేను అనే బలహీనతను వదలాలి.తన  బలం ( పనిచేయగలననే)పై నమ్మకం లేని వారు దేనినీ సాధించలేరు. ఎందుకంటే సందేహిస్తూ చేసిన పనిలో తన శక్తిని పరిపూర్ణంగా వెచ్చించటం ఉండదు. దానికి అనుగుణంగానే ఫలితం అరకొరగా ఉంటుంది. బలహీనత అంటే ఏమిటి.. బలహీనత ఎందుకు వస్తుంది.. మనుషుల్లో బలహీనతలు ఒక్కటే కాదు, అనేకం ఉంటాయి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం  

మనిషి జీవితం ఒక యుద్ధరంగం లాంటిది.. ప్రతి పనిని మానవుడు యుద్దంలా ప్రతిపనిని చేయాలి. అలా చేసే  యుద్ధంలో బయట శత్రువులు కన్నా మన లోపల అంతర్లీనంగా ఉండే  బలహీనతలే పెద్ద శత్రువులు. మనిషి తన బలహీనతలను జయిస్తేనే నిజమైన విజేతగా నిలుస్తాడు. కానీ చాలా సార్లు మనిషి తన బలహీనతలకు లొంగిపోతూ, తన జీవితాన్ని తానే సంక్లిష్టం సుకుంటాడు.

బలహీనత అనేది మన మనసులోని ఒక దుర్బల స్థితి. అది మన ఆలోచనలను, నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. ఎవరో ఒకరు మనలను పొగిడితే మనకు ఆనందం కలుగుతుంది. ..మీరు గొప్పవారు... మీరు చాలా తెలివైనవారు.... మీరు ధైర్యవంతులు.... అని చెప్పినప్పుడు మనసు ఆనందంతో నిండిపోతుంది. కానీ అదే ఆనందం మనకు తెలియకుండానే ఒక బంధంగా మారుతుంది. ఇది క్రమేణ  ఒక మానసిక ఉచ్చుగా మారుతుది.

ఎందుకంటే ఆ పొగడ్తల వెనుక ఉన్న ఉద్దేశాన్ని మనం గుర్తించలేకపోతాం. ఆ మాటలకి ఆకర్షితులై, మనం ఎదుటివారికి లొంగిపోవడం అనే విషయాలు మానవుల జీవితాల్లో ఎవరికి వారు తెలియకుండానే  ప్రభావితమవుతుంటారు. ఇలా ప్రభావితం అయ్యారంటే కచ్చితంగా వారిలో ఏదో ఒక రకమైన బలహీనత ఉన్నట్లేనని పలు గ్రంథాలు చెబుతున్నాయి.

బలహీనతల రకాలు 

1 పొగడ్తల పట్ల బలహీనత : ప్రశంసలు వినాలనే కోరిక
2 డబ్బు పట్ల బలహీనత:  ఎక్కువ సంపాదన కోసం ఏదైనా చేయాలనే తపన
3 మద్యపానం పట్ల బలహీనత : అలవాటు బానిసత్వంగా మారడం
4 శరీర వాంఛల పట్ల బలహీనత : -- నియంత్రణ కోల్పోవడం
5 అహంకారం పట్ల బలహీనత: నేనే గొప్ప అనే భావన.. ఇది మనిషిని నెమ్మదిగా తన స్వభావం నుంచి దూరం చేస్తుంది. 
6. సన్మానాలు సత్కారాలు బిరుదుల కొరకు గౌరవ మర్యాదల కొరకు లొంగిపోవడం కూడా ఒక బలహీనతే
7. కొందరికీ దొంగతనాలు చేసే అలవాటు ఉంటుంది దానివల్ల ఎంతో అనర్థం జరుగుతుంది విలువ గౌరవం మర్యాద మంట కలిసిపోవడంకూడా ఒక బలహీనత
8 పర స్త్రీ వ్యామోహం బలహీనత: ఈ బలహీనత  ఉన్న వారు అంటే  అందరికీ భయపడాలి. ఇంట్లో బయట సమాజంలో తన అంతరాత్మకు భయపడాలి తప్పు చేస్తున్నాను అని ఫీలింగ్ నిరంతరం వెంటాడుతుంది ఇది ఒక బలహీనత ఎవరైనా మన బలహీనతను గమనిస్తే, దాన్ని ఆయుధంగా ఉపయోగిస్తారు. మన బలహీనతలతో ఆడుకుంటారు. 

బలహీనతలతో బ్లాక్ మెయిల్ చేస్తారు. 

  • బలహీనతలను అడ్డం పెట్టుకొని బెదిరిస్తారు.
  •  బలహీనతలను గుర్తు చేసి అవమానిస్తారు 
  • బలహీనతలను గుర్తుచేసి వారికి అనుకూలంగా పనులు చేయించుకుంటారు. 

ఎవరైనా పొగడ్తలతో మన విశ్వాసాన్ని పొందుతారు. మన బలహీనతను ఉపయోగించి మనపై ప్రభావం చూపుతారు. చివరికి మనల్ని తమ అవసరాలకు వాడుకుంటారు. ఇలా మనం తెలుసుకోకుండానే ఒక ఉచ్చులో పడిపోతాం. ఆ సమయంలో మనం వారి మాటే వింటాం, వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాం.

బలహీనతలకు లొంగిపోవడం ..  పెద్ద ప్రమాదం .

ఎవరైనా మన బలహీనతను ఆధారంగా చేసుకుని బెదిరించవచ్చు.మనపై ఆధారాలు సేకరించవచ్చు. మనను తమ నియంత్రణలో పెట్టుకోవచ్చు. అప్పుడు మనం బయటపడటం చాలా కష్టం అవుతుంది. మనిషి తనను తాను కోల్పోవడం.

ఇంకో ప్రమాదం ఏమిటంటే మనిషి తనను తానే కోల్పోవడం. బలహీనతలకు లొంగిపోతూ తన విలువలను మరిచిపోతాడు. తన ఆత్మగౌరవాన్ని కోల్పోతాడు. తన జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెడతాడు, చివరికి అతను తన సర్వస్వాన్ని కూడా వదులుకునే స్థితికి చేరుకుంటాడు.మనిషి ఎవరు చూడడం లేదే ఎవరికి తెలియడం లేదు అని అనుకుంటారు కానీ అది ఏదో రకంగా తెలిసిపోతుంది. చివరకు అదే ప్రాణాల మీదికి వస్తుంది. నీ బలహీనతలే ధన మానా ప్రాణాలకు ముప్పు కలుగుతుంది.

ఎప్పుడైతే అవి ఏవో బాధల్ని తెచ్చి..  మనల్ని కృంగదియ్యాలనే బలహీనత వచ్చిందంటే  ..వెంటనే అప్రమత్తమై, ఆ ఆలోచనలను తరిమేసేలా, మనసును అన్య విషయాలపైకి మళ్ళించుకోవాలి. మనలో ఉన్న శక్తియుక్తుల్ని మన ఉన్నతికే తప్ప, పతనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.

 జీవితం అన్నాక సమస్యలు తప్పనిసరిగా ఉంటాయి... మనకైనా, మన పక్కవాళ్ళకైనా, అవి సహజం. బాధలున్నాయని బలహీనతతో బాధపడకుండా   వాటిని   ధైర్యంగా ఎదుర్కోవాలి. మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే, మనల్ని బలహీనుల్ని చేసేది, వేరెవరో కాదు.. స్వయంగా మన ఆలోచనలే ! బలం - బలహీనత ఎక్కడో లేవు, మన ఆలోచనల్లోనే ఉన్నాయి. అందుకే, ఆలోచనల మీద నియంత్రణ సాధించిన వ్యక్తి విజయ సోపానాలను అధిరోహిస్తాడు. మరెంతో మందికి ఆదర్శమవుతాడు.